ఖారీ యాసీన్ ఫఖియ్యహ్ అల్ జజాయిరీ. జజాయిర్ రాజధాని పట్టణంలోని హయ్యల్ హరాష్ లో 1969లో జన్మించారు. ఆయన బువైరహ్ దేశ కుటుంబానికి చెందుతారు. కెమికల్ ఇంజనీరింగ్ లో పట్టభద్రులయ్యారు. ఉసూల్ అద్దీన్ లో కూడా. జజాయిర్ లో అల్ అజ్రఖ్ పద్ధతిలో రివాయత్ వర్ష్ లో ఖుర్ఆన్ పఠనం రికార్డు చేసిన మొట్టమొదటి వ్యక్తి. ప్రస్తుతం ఆయన మస్జిద్ అబూ ఉబైదహ్ బిన్ జర్రాహ్, బల్దియహ్ బాష్ జరాహ్ అల్ ఆసమియ్యహ్ లో ఇమామ్ గా పనిచేస్తున్నారు.
యూసుఫ్ బిన్ అబ్దుల్లాహ్ అష్ షువైఈ - సౌదీ అరేబీయాలోని పవిత్ర ఖుర్ఆన్ మరియు సైన్సెస్ సొసైటీ సభ్యుడు, రియాద్ నగరంలోని అతీఖహ్ ప్రాంతంలో ఉన్న అమీర్ అబ్దుల్లాహ్ బిన్ ముహమ్మద్ మస్జిద్ యొక్క ఇమాం.