ఖారీ అబ్దుల్ అలీ బిన్ తాహిర్ అఅనూన్. మగ్రిబ్ లోని ఫాస్ పట్టణంలో 1947లో జన్మించారు. వర్ష్ అన్ నాఫియీ రివాయతులో అల్ అబిహానీ పద్ధతిలో షేఖ్ అహ్మద్ బిన్ ఉథ్మాన్ అబూ అల్ ఆలా నుండి ఖుర్ఆన్ పఠనం అనుమతి పొందారు. తజ్వీద్ లో ఉద్ధండులు. తజ్వీద్ విద్య ను అభ్యసించారు. లజ్న తహ్కీమ్ లి తిలావతుల్ ఖుర్ఆన్ అల్ కరీమ్ సంస్థలో పనిచేస్తున్నారు. ఆయన కైఫ నురత్తిలల్ ఖుర్ఆన్ బిరివాయతు వర్ష్ అన్ నాఫియీ మిన్ తరీఖ్ అల్ అజ్రఖ్ అనే పుస్తకం వ్రాసినారు.
1963లో మొరాకో దేశంలో జన్మించారు. ఖుర్ఆన్ గ్రంథాన్ని పూర్తిగా కంఠోపాఠం చేసారు. దారుల్ బైదాఅ విద్యాసంస్థలలో నుండి హిజ్రీ 1413వ సంవత్సరం రబియ అత్ తానీ నెల 24వ తేదీ అంటే 1992వ సంత్సరం అక్టోబరు నెల 22వ తేదీన చేరినారు. దారుల్ బైద్అలోని అస్సబీల్ బయీన్ అల్ షఖ్ లో ఇమాం మరియు ఖతీబ్ గా పనిచేసారు. ఖుర్ఆన్ సొసైటీలలో సభ్యులయ్యారు. 2005వ సంవత్సరం అల్ మసీరతుల్ ఖురానీయ్యహ్ లో మరియు 2010లో అల్ ముస్హఫ్ సున్నతులో సభ్యులయ్యారు. హిఫ్స్ అల్ ఖుర్ఆన్ బైతక్ (احفظ القرآن في بيتك) అనే ఆయన ప్రాజెక్టు ఖుర్ఆన్ కంఠస్థం చేయాలనుకున్న వారికి జామియహ్ అల్ షరాహ్ మస్జిద్ నుండి ప్రత్యేక సేవలందించింది. ఆయన అనేక పద్ధతులలో చక్కటి ఖిర్ఆత్ తో ఖుర్ఆన్ పారాయణం చేసేవారు.