ఇస్లాం ధర్మం లో ఆహారపానీయాలు సేవించే విధానం, అతిథితులతో ప్రవర్తించే మరియు ఆతిథ్యం ఇచ్చే విధానం – ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివసల్లం బోధనల ఆధారంగా.
సృష్టికర్త ఉద్దేశ్యం అనే విషయమై వివిధ ధర్మాల అభిప్రాయాలు వాటి గ్రంథాల ఆధారంగా ఈ పుస్తకంలో చర్చించబడినది. చివరిగా ఇస్లాం ధర్మం యొక్క సందేశం - మానవాళి యొక్క సృష్టి కేవలం సృష్టికర్తను ఆరాధించటమే మరియు ఆ సృష్టికర్త పంపిన అంతిమ సందేశం ప్రకారం జీవించటమే అనే సందేశాన్ని ఈ పుస్తకం ప్రామాణిక ఆధారాలతో నిరూపిస్తున్నది.
అనేక ఇస్లామీయ పదాల వివరణ ఈ మొదటి తెలుగు నిఘంటువులో సమకూర్చబడినది. తెలుగులో ఇది మొదటి ఇస్లామీయ పద నిఘంటువు. దీనిలో ఇస్లామీయ పదాలు చాలా స్పష్టంగా వివరించబడినాయి. ఇది ప్రత్యేకంగా ముస్లిమేతరులకు మరియు క్రొత్తగా ఇస్లాం స్వీకరించిన వారికీ ఎక్కువగా ఉపయోగపడును. అరబీ లేదా ఉర్దూ తెలియని ముస్లింలకు కూడా ఇది బాగా ఉపయోగపడును. రాబోయే ప్రతులలో ఇంకా ఎక్కువ పదాలు చేర్చబడును. ఇన్షాఅల్లాహ్.
తెలుగు భాషలో ఇది ఖుర్ఆన్ యొక్క రెండో అనువాదం. దీనిలో మొదటి 10 భాగాల అనువాదం ఉన్నది. ఇది 1945లో ముద్రించబడిన ప్రాచీన ప్రతి. దీని యొక్క మిగిలిన భాగాల కొరకు అన్వేషిస్తున్నాము. అవి ఎవరి వద్దనైనా ఉంటే వెంటనే మమ్మల్ని సంప్రదించవలెను. దీనిని మీ ముందుకు తీసుకురావటంలో సహాయపడిన వారందరి కృషిని అల్లాహ్ స్వీకరించుగాక.
ఈ మాస పత్రికలో మానవుడి ఇహపరలోకాల సాఫల్యం కొరకు అవసరమైన అన్ని విషయాలు చాలా చక్కగా, స్పష్టంగా, ప్రామాణిక ఆధారాలతో చర్చించబడుతున్నాయి. పిల్లల నుండి పెద్దల వరకూ, ఆడమగ, జాతి-కుల-మత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ తప్పక చదవ వలసిన మాసపత్రిక ఇది. నెలనెలా దీని ప్రతి తిన్నగా మీ ఇంటికి చేరాలంటే డాక్టర్ నాగిరెడ్డి శ్రీనివాసరావు గారిని ఇందులోని ఫోను నెంబరు ద్వారా సంప్రదించండి.