కేటగిరీలు

معلومات المواد باللغة العربية

అల్ అఖీదహ్

ఇస్లామీయ అఖీదహ్ కు సంబంధించి అనేక అంశాలు ఇక్కడ ఉన్నాయి - ఉదాహరణకు వర్గాలు మరియు ధర్మాలు, అల్లాహ్ పై విశ్వాసం, ముహమ్మద్ రసూలుల్లాహ్ పై విశ్వాసం, దైవదూతలపై విశ్వాసం, జాదూ మరియు మాయలు, సందేశహరుడు మరియు ఆయన సందేశాలు, అంతిమదినం పై విశ్వాసం, ఖదర్ పై విశ్వాసం, ఈమాన్ యొక్క మూలస్థంభాలు, అఖీదహ్ ప్రాథమిక నియమాలు, సహాబాలు, అల్ వలా మరియు అల్ బరా అంటే ఇష్టాయిష్టాలు మొదలైన అన్ని అంశాలు ఇక్కడ ఉన్నాయి.

అంశాల సంఖ్య: 44

  • తెలుగు

    PDF

    ఈ వ్యాసం సత్యప్రియులైన క్రైస్తవులను ఉద్ధేశించి వ్రాయబడినది. ఇందులో వారిని మానవుడు పుట్టడమే ఒక పాపం, యేసు దేవుడి ఏకైక కుమారుడు, యేసు మానవులను కాపాడటానికి అవతరించాడనే మూడు వాదనలు ఎంత అబద్ధమైనవో బైబిల్ దివ్యగ్రంథం ద్వారా నిరూపిస్తుంది. చివరిగా ఆలె ఇమ్రాన్ లోని 64వ వచనం తో ముగిస్తుంది.

  • తెలుగు

    PDF

    ఖుర్ఆన్ - అల్లాహ్ వాక్కు, మానవజాతి కొరకు మార్గదర్శకత్వం, అంతిమ సందేశం మరియు అది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై ఎలా అవతరించిందనే ముఖ్యాంశాలను ఈ కరపత్రం చర్చిస్తున్నది. అంతేగాక, ఈ ఖుర్ఆన్ గ్రంథాన్ని అవతరింపజేసింది అల్లాహ్ యే ననే సత్యాన్ని మనం ఎలా కనిపెట్టగలమో తెలుపుతున్నది. ఇంకా మానవజాతి కొరకు ఈ ఖుర్ఆన్ గ్రంథం అవతరింపజేయబడటం వెనుక ఉన్న ఉద్దేశాన్ని చర్చిస్తున్నది.

  • తెలుగు

    PDF

    అసలు ప్రవక్తత్వం అంటే ఏమిటి అనే విషయాన్ని ఈ కరపత్రం చరిస్తున్నది. ప్రవక్తలందరూ అందజేసిన దివ్యసందేశం ఒక్కటే - కేవలం అల్లాహ్ మాత్రమే సకల ఆరాధనలకు అర్హుడు. తమ ప్రవక్తత్వాన్ని నిరూపించుకోవడానికి అల్లాహ్ ఆజ్ఞతో ప్రవక్తలందరూ కొన్ని మహిమలు చేసి చూపారు.

  • తెలుగు

    PDF

    ఇస్లాం ధర్మం నాస్తికత్వం గురించి చాలా వివరంగా ప్రామాణిక ఆధారాలతో ఇక్కడ చర్చించబడింది. ఇంకా ఇందులో “మనం ఈ ప్రపంచంలో ఎందుకు కష్టనష్టాలకు గురవుతున్నాము, బాధలు పడుతున్నాము, ఈ ప్రపంచంలో అల్లాహ్ ఎందుకు ప్రజలను శిక్షిస్తాడు, స్వయంగా ఆయన మన ఎదురుగా ఎందుకు రాడు, ఆయన ఎందుకు మనల్ని పరీక్షిస్తున్నాడు” మొదలైన ప్రశ్నలకు జవాబు ఇవ్వవలసినదిగా నాస్తికులకు సవాలు చేయబడుతున్నది. మనం అల్లాహ్ ను ఎందుకు విశ్వసించాలో హేతుబద్దంగా సమాధానం ఇవ్వబడింది.

  • తెలుగు

    లా ఇలాహ ఇల్లల్లాహ్ యొక్క అసలైన అర్థం, ఆ పవిత్రసాక్ష్య వచనం యొక్క షరతులు మరియు ముహమ్మదుర్రసూలుల్లాహ్ పై మనం చూపవలసిన కనీస మర్యాదలు – బాధ్యతలు, తౌహీద్ రకాలు, ఇస్లాం నుండి బహిష్కరింపజేసే విషయాలు – వీటిపై అభ్యాసాలు అంటే ప్రాక్టీసు వర్క్ షీట్లు. అల్లాహ్ పై విశ్వాసం, దైవదూతలపై విశ్వాసం, దివ్యగ్రంథాలపై విశ్వాసం, రసూల్ (ప్రవక్త) లపై, ప్రళయదినంపై విశ్వాసం, అల్ ఖదర్ (అదృష్టదురదృష్టాల)పై విశ్వాసం గురించిన ప్రాక్టీసు పేపర్లు. అల్ షిర్క్ (దైవత్వంలో భాగస్వామ్యం), అల్ కుఫ్ర్ (సత్యతిరస్కారం), అల్ నిఫాఖ్ (కపటత్వం), అల్ బిదాఅ (అసలు ధర్మంలో లేని విషయాలు నూతనంగా కల్పించటం) – వీటిపై అభ్యాసాలు అంటే ప్రాక్టీసు వర్క్ షీట్లు. ధర్మాధర్మాలపై నడిచే తోటివారిపై తమ ఇష్టాయిష్టాలు ఎప్పుడు – ఎలా - ఏ విధంగా చూపమని ఇస్లాం ఉపదేశిస్తున్నది, ఇస్లామీయ ధర్మశాసన తీర్పు, మాజిక్, సూఫియిశమ్, ఇంకా వేరేవాటి ద్వారా వేడుకునే మరియు ప్రార్థించే సరైన పద్ధతులలో ఏవి అనుమతింపబడిని మరియు ఏవి నిషేధింపబడినవి – వీటిపై అభ్యాసాలు అంటే ప్రాక్టీసు వర్క్ షీట్లు.

  • తెలుగు

    PDF

    ఒక దాసుడు తన జీవితంలో సృష్టికర్తకు చూపగలిగే సంపూర్ణం విధేయత ఈ వ్యాసంలో వివరించబడినది.

  • తెలుగు

    PDF

    అన్నిఫాఖ్ అంటే కపటత్వం యొక్క నిర్వచనం మరియు దాని యొక్క భాగాల గురించి ఈ వ్యాసంలో క్లుప్తంగా చర్చించబడినది.

  • తెలుగు

    PDF

    క్లుప్తంగా జకాత్ దానం (తప్పనిసరిగా చేయవలసిన దానం) గురించిన వివరములు

  • తెలుగు

    PDF

    క్లుప్తంగా రమదాన్ నెలలో ఉండవలసిన ఉపవాసముల గురించిన వివరములు

  • తెలుగు

    PDF

    అల్లామా సనావుల్లాహ్ అమృతసరీ (రహ్మతుల్లాహ్ అలైహి) గారి ఈ వ్యాసాన్ని మర్కజ్ దారుల్ బిర్ర్ విద్యార్థిని షఫీఆ అహ్మదీయా చక్కటి తెలుగులో అనువదించారు. దీనిలో మిర్జా గులామ్ అహ్మద్ ఖాదియానీ తాను ప్రవక్తనని నిరూపించుకోవడానికి చూపుకున్న కొన్ని బూటకపు నిదర్శనాలు ఆధారాలతో సహా పేర్కొనబడినాయి.

  • తెలుగు

    PDF

    అల్లామా సనావుల్లాహ్ అమృతసరీ (రహ్మతుల్లాహ్ అలైహి) గారి ఈ వ్యాసాన్ని మర్కజ్ దారుల్ బిర్ర్ విద్యార్థిని హనీఫా అహ్మదీయా చక్కటి తెలుగులో అనువదించారు. దీనిలో మిర్జా గులామ్ అహ్మద్ ఖాదియానీ స్వయంగా చేసుకున్న కొన్ని ఆత్మస్తుతి ప్రగల్భాలు ఆధారాలతో సహా పేర్కొనబడినాయి.

  • తెలుగు

    PDF

    అల్లామా సనావుల్లాహ్ అమృతసరీ (రహ్మతుల్లాహ్ అలైహి) గారి ఈ వ్యాసాన్ని మర్కజ్ దారుల్ బిర్ర్ విద్యార్థిని షమ్సున్నిసా అహ్మదీయా చక్కటి తెలుగులో అనువదించారు. దీనిలో మిర్జా గులామ్ అహ్మద్ ఖాదియానీ స్వయంగా చేసిన అనేక పరస్పర విరుద్ధ ప్రకటనలు ఆధారాలతో సహా పేర్కొనబడినాయి.

  • తెలుగు

    PDF

    అల్లామా సనావుల్లాహ్ అమృతసరీ (రహ్మతుల్లాహ్ అలైహి) గారి ఈ వ్యాసాన్ని మర్కజ్ దారుల్ బిర్ర్ విద్యార్థిని జబీరా అహ్మదీయా చక్కటి తెలుగులో అనువదించారు. దీనిలో మిర్జా గులామ్ అహ్మద్ ఖాదియానీ యొక్క గుణాల గురించి వివరించబడింది.

  • తెలుగు

    PDF

    సన్మార్గంపై జీవిస్తూ ప్రఖ్యాతి చెందిన ముందుతరం నలుగురు ముస్లిం పరిపాలకుల గురించి ఇక్కడ క్లుప్తంగా వివరించబడింది.

  • తెలుగు

    PDF

    ఈ ప్రాపంచిక జీవితం ఎంత చిన్నదో మరియు తీర్పుదినం ఎంత దగ్గరలో ఉందో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సహచరులకు వివిరంగా బోధించారు. ఆయన అంతిమ దినం గురించి అనేక చిహ్నాలను సూచించారు. వాటిలో కొన్ని జరిగిపోయినాయి. మరికొన్ని జరుగుతున్నాయి. మిగిలినవి భవిష్యత్తులో జరగ బోతున్నాయి. ఆ అంతిమ దినం కొరకు కష్టపడి తయారు కావాలని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సహచరులకు మరియు మనకు జ్ఞాపకం చేసియున్నారు.

  • తెలుగు

    PDF

    107 ధర్మపరమైన నిషేధాల గురించి ఈ పుస్తకంలో వివరంగా చర్చించబడింది. ఈ ప్రాపంచిక జీవితాన్ని సరిదిద్దుకుని, ధార్మిక నిషేధ ఆచరణలకు దూరంగా ఉంటూ, ఇహపరలోకాలలో సాఫల్యం పొందటానికి మనకు ఇవి బాగా ఉపయోగపడతాయి.

  • తెలుగు

    PDF

    దీనిలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నిజాయితీ గురించి వివరించబడింది.

  • తెలుగు

    PDF

    అద్వితీయుడైన అల్లాహ్ విషయంలో మనం చేస్తున్న షిర్క్, కుఫర్ వంటి ఘోరమైన అన్యాయముల గురించి ఈ వ్యాసంలో చర్చించబడింది.

  • తెలుగు

    PDF

    ఆత్మహత్య చేసుకోవడాన్ని ఇస్లాం నిషేధించినది.

  • తెలుగు

    DOC

    మానవ సృష్టి ఆరంభం గురించి మీరు నాకు తెలియజేయగలరా?